రెండవ రోజుకు చేరుకున్న ఐకెపి విఓఏల సమ్మె…

రెండవ రోజుకు చేరుకున్న ఐకెపి విఓఏల సమ్మె…
దండేపల్లి, ఆంధ్రప్రభ : గత 25 సంవత్సరాలుగా గ్రామల్లో మహిళ సంఘాలలో పనిచేస్తున్న ఐకెపి విఓఏ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ,బుధవారం దండేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు రెండవ రోజు విఓఏలు నిరవధిక సమ్మె చేపట్టారు, ఈ సందర్భంగా విఓఏల సంఘం అధ్యక్షుడు బద్రి సత్యనారాయణ మాట్లాడుతూ,గ్రామంలో మహిళలను సంఘ సభ్యులుగా చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల్లోకి చేర్పిస్తూ, మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం తిరిగి చెల్లించండం వంటి వివిధ రకాల పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ పై సవతి ప్రేమ చూపుతుందని అన్నారు.
పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని నెలకు20 వేల గౌరవ వేతనం చెల్లించాలని, అర్హులైన వారికి పదోన్నతి కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్, ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు, జీవో 58 సవరించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే వారు సమ్మె విరమణ చేయమని హెచ్చరించారు.గ్రామ స్థాయిలో ఉన్న సంఘ సబ్యుల పనులు ఆపేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు కొప్పుల లింగన్న,ప్రధాన కార్యదర్శి మంగ, ఉపాధ్యక్షులు ముత్యం శ్రీనివాస్, సలహాదారులు అనంతలక్ష్మి, భూలక్ష్మి,నీరజ,విజయ, భూ లక్ష్మీ, కనక లక్ష్మీ, మంజుల,సుజాత రామన్న, లింగన్న, మహేష్, రవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
