MLA | తండ్రిని విమర్శించడం సరికాదు…
MLA | తండ్రిని విమర్శించడం సరికాదు…
MLA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమకారుడి బిడ్డగా కవితకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, అయితే తొలి సమావేశంలోనే తండ్రిని విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు.
తండ్రికి విలువ ఇవ్వని వ్యక్తి అమ్మ ఎలా అవుతుందని రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. కుటుంబ సంబంధాల విషయంలో మర్యాద, గౌరవం ఉండాలని సూచించారు.

కవితకు తన అన్నపై ఉన్న కోపాన్ని తండ్రిపై చూపించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ భేదాలున్నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. మద్యం కుంభకోణం కేసులో కవితకు ఇప్పటివరకు క్లీన్చిట్ రాలేదని, కేసు ఇంకా పూర్తిగా ముగియలేదని రాజగోపాల్రెడ్డి గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
