1500 feet | వరికపూడిసెల..

1500 feet | వరికపూడిసెల..
కలేనా ?
1500 feet | ఏడు దశాబ్దాలుగా ప్రాజెక్టు నిర్మాణానికి పడని ముందడుగు !
ముగ్గురు సీఎంలు శంకుస్థాపన చేసినా పనులకు కలగని మోక్షం
చెంతనే కృష్ణమ్మ.. అయినా పల్నాడు వాసులకు నీటి కటకట
అడుగంటిన భూగర్భ జలాలు.. చుక్కనీరు పడని బోర్లు
పంటలను కాపాడుకోలేక రైతుల ఆత్మహత్యలు
ప్రాజెక్టును పూర్తి చేస్తే 25 గ్రామాలకు సాగు, 20వేల మందికి తాగునీరు
వరికపూడి సెల జల సాధన సమితి- ఎగువ పల్నాడు ఆధ్వర్యంలో..
మే 1నుంచి రిలే నిరాహార దీక్ష
ప్రాజెక్ట్ నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్
1500 feet | పల్నాడు ప్రతినిధి ఆంధ్రప్రభ: ఏడు దశాబ్దాల కల కలగానే మిగిలిపోతోంది. వరికపూడిసెల ప్రాజెక్టుకు ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసినా నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పర్యావరణ అనుమతులు లభించినా ప్రజాప్రతినిధులు ఆ ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వరికపూడి సెల జల సాధన సమితి- ఎగువ పల్నాడు ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి మాచర్ల అంబేద్కర్ సెంటర్ నందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నామని సమితి సభ్యులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పనులు ప్రారంభించాలని సమితి సభ్యులు కోరుతున్నారు.
1500 feet | వరికపూడి సెల ప్రాజెక్ట్ పరిధి ఇదీ..
జిల్లాలు రెండు: పల్నాడు, మార్కాపురం
నియోజకవర్గాలు మూడు : మాచర్ల, వినుకొండ, యర్రగొండపాలెం
మండలాలు: వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, మాచర్ల, బొల్లాపల్లి, పుల్లలచెరువు. అంతేకాకుండా 30 చెరువులు, 100 గ్రామాలు, 1.3 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల ప్రజలకు తాగునీటి కోసం 70 ఏళ్లుగా పోరాటం… ఇది ఈ ప్రాజెక్టు ముఖచిత్రం.

1500 feet | ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన..
1996-03-05న నారా చంద్రబాబు నాయుడు
2008-06-05న వై.ఎస్. రాజశేఖర్రెడ్డి
2023-11-15న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
2023-08-03న నారా లోకేష్ (యువగళం పాదయాత్రలో శిలా ఫలకం)
నేడు పల్నాడు పరిస్థితి..
కృష్ణా నదికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న పల్లెలు, గ్రామాలు, గిరిజన తండాలు తాగునీటికి నోచుకోక తల్లడిల్లుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోయి దాదాపు 1500 అడుగుల లోతులో బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. పంటను కాపాడుకోవాలనే ప్రయత్నంలో రైతులు బోర్ల మీద బోర్లు వేసి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొందరు రైతులు, రైతుకూలీలు పొట్ట చేతపట్టుకొని వలసలు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొద్ది సంవత్సరాలలో ఈ ఎగువ పల్నాడు “ఎడారి”గా మారే పెను ప్రమాదం పొంచి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అది నేటికీ నెరవేరలేదు.
ఐక్య పోరాటాలకు సిద్ధం..
“పార్టీలకు అతీతంగా మనమందరం ఐక్యంగా కలిసి పోరాడుదాం. ఈ పోరాటంలో రైతులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కలిసి నడుస్తారని, ఈ పోరాటంలో భాగస్వాములై విజయాన్ని సాధించేంతవరకు విశ్రమించరాదని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నామని… వరికపూడిసెల ప్రాజెక్టు సాధనకు రండి… కదలి రండి…” అంటూ వరికపూడిసెల జల సాధన సమితి- ఎగువ పల్నాడు పిలుపునిచ్చింది.
మే ఒకటి నుంచి..
వరికపూడిసెల ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ… మే ఒకటో తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తున్నట్లు పోరాట సమితి పేర్కొంది. ప్రతీ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘ నాయకులు, సభ్యులు దీక్షలో పాల్గొని మద్దతు తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరికీ పేరు, పేరునా కోరుతున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. ఇది మన పోరాటం…మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం…మన అందరం కలిసి సాధించుకుందాం…సాధిద్దాం సాధిద్దాం.. వరికపుడిసెల సాధిద్దాం.. అనే నినాదాలతో ఈ దీక్షలో పాల్గొననున్నామని వారు పేర్కొంటున్నారు.
పర్యావరణ అనుమతులు మంజూరు..
పల్నాడు జిల్లాలో ప్లాన్ చేసిన వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ చర్చించింది. ఈ మేరకు ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించిన కమిటీ.. అల్ప వర్షపాతం, వెనుకబాటుతనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత అనుమతులకు సిఫార్సు చేసింది. గత పదేళ్లుగా ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.. చివరికి అనుకున్నది సాధించారు.
ప్రాజెక్టు స్వరూపం..
ఈ ప్రాజెక్టు ద్వారా 84,500 ఎకరాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.3,227.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల 25 గ్రామాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 270 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించారు. అడిగొప్పుల, ఆత్మకూరు, దరివేముల ప్రాంతాల్లో సేకరించనున్నారు. ఈ భూముల్లో 19.13 హెక్టార్లు అటవీ భూమి ఉంది. 4.86 టీఎంసీల నీటిని వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని పొలాలకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వరికపూడిసెల వాగు నుంచి ఎత్తిపోయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు పరిధిని విస్తరించనున్నారు. మొదట 24,900 ఎకరాలకు పరిమితమైన ఈ ప్రాజెక్టు పరిధిని 84,500 ఎకరాలకు పెంచారు. దీని కోసం గతేడాది అక్టోబర్ 31న జీవో కూడా విడుదలైంది. ఈ ప్రాజెక్టు వల్ల పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది.
CLICK HERE TO READ MORE : Data by 2028 | గూగుల్.. గేమ్ చేంజర్..
