Telangana Formation Day | కాంగ్రెస్ సేవాదళ్ సందేశం..
Telangana Formation Day | కాంగ్రెస్ సేవాదళ్ సందేశం..
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల జీవితాల్లో మార్పు : మిద్దెల జితేందర్
Telangana Formation Day | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు, విద్యార్థుల ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య విలువలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం అవుతోందని జితేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక, ప్రజాకేంద్రిత పాలన అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తోందన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు విద్యా సహాయం, బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని వివరించారు.

పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువత ఉపాధి కల్పన వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, జాతీయ ఐక్యతకు కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలను విభజించే శక్తులను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటుందని జితేందర్ స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లో ఉండి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదళ్ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు.
