May 1st | SIR సర్వే పై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు

May 1st | SIR సర్వే పై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు

May 1st | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓటరు జాబితా సవరణ కోసం మే 1 నుండి నిర్వహించే ఇంటింటి సర్వే (ఎస్ఐఆర్ ) కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SIR సర్వే పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని సర్వే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

మే 1 వ తేదీ నుండి ఎన్నికల సంఘం ఆద్వర్యంలోని అధికారులు ఇంటింటికీ వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు ఓటరు జాబితాతో సరి చూసుకుంటారని చెప్పారు. ఇంటింటి సర్వేకు వచ్చే అధికారుల (BLO) లతో సమన్వయం చేసుకునేందుకు గాను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ కు ఒకరు చొప్పున ఏజెంట్లుగా నియమిస్తున్నట్లు వివరించారు. ఇందుకు గాను ఏజెంట్ గా నియమించడం కోసం బూత్ పరిధిలోని నివాసాలు, ఓటర్ల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వారిని గుర్తించి వారి వివరాలతో కూడిన జాబితాను అందజేయాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల జాబితా ప్రకారం మీమీ ప్రాంతాల్లోని ఓటర్లను సర్వే సమయంలో అధికారులతో వ్యవహరించాల్సిన తీరు, అందించాల్సిన సమాచారం గురించి అవగాహన కల్పించాలని చెప్పారు.

సర్వే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించకుంటే జరిగే నష్టాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి నూతన ఓటరుగా నమోదు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, కిషోర్, అశోక్ యాదవ్, ఏసూరి మహేష్, నామన సంతోష్, సురేష్ గౌడ్, మహేష్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, ప్రేమ్, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, బాలరాజ్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్, లలితా గోపిలాల్ చౌహన్, జయరాజ్, సత్యనారాయణ, గణేష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.