వైభవంగా బంగారు రథంపై ఊరేగుతున్న ప్రహల్లాద రాయలు

వైభవంగా బంగారు రథంపై ఊరేగుతున్న ప్రహల్లాద రాయలు

మంత్రాలయం, ఆంధ్రప్రభ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దేశంలో రెండో తిరుపతిగా పేరుగాంచిన మంత్రా లయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవ మూర్తి ప్రహ్లాద రాయల బంగారు రథం పై భక్తులకు దర్శన మిచ్చారు. ఆదివారం పురస్కరించుకొని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మూల రామదేవులకు ప్రత్యేక పూజలు పీఠాధిపతి నిర్వహించారు. బంగారు రథోత్సవంపై ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తుల నడుమ ఊరేగించారు అనంతరం ఉంజల సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు , ఐపి నరసింహమూర్తి, వ్యాసరాజ్ ఆచార్ తదితర మఠం సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో మొక్కలు తీర్చుకున్నారు.

Leave a Reply