కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి..

చిన్నకాపర్తిలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
చిట్యాల, ఏప్రిల్ 27 ఆంధ్రప్రభ : మండలంలోని చిన్న కాపర్తి గ్రామంలో సోమవారం నాడు 25 బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,గులాబీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ, మాజీ సీఎం కేసీఆర్, జై చిరుమర్తి అంటూ అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం బోయపల్లి శీను వాసు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ దశను, దిశను మార్చేది బిఆర్ఎస్. పార్టేనని, కేసిఆర్ పోరాట పటిమతో, అమరవీరుల ఆత్మబలిదానంతో సాదించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసిఆరుదేనని కొనియాడారు. కేసిఆర్ తెలంగాణ ను అభివృద్ది పరంగా భారతదేశంలో ప్రథమస్థానంలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్ళీ కరువుకాటకాలు, విద్యుత్ కోతలు, హైడ్రా కూల్చివేతలు, రైతుల ఆత్మహత్యలతో తెలంగాణగాను అదోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. రాబోయే రెండున్నర ఏళ్లలో మళ్ళీ . పార్టే అధికారంలోకి వస్తుందని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మార్చే విధంగా కేసిఆర్ నూతన ఉత్సాహంతో కదులుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలిమినేడు సింగిల్ విండో మాజీ చైర్మన్ రుద్రారపు బిక్షపతి, బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు వలిగొండ రామచంద్రం, రూపని దుర్గయ్య రైతు సంఘం చైర్మన్, వలిగొండ సురేష్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, పెరిక రాజు 9. వార్డు సభ్యులు, హెచ్ స్వామి, పాకాల రవి, మామిడి స్వామి తదితరులు పాల్గొన్నారు.
