చిట్యాలలో అధికారికంగా వాసవి మాత జయంతోత్సవాలు

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో చిట్యాల పుర చైర్ పర్సన్ పందిరి గీత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంగా వాసవి మాతా జయంతి ఉత్సవం ఆదివారం నాడు మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీత జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాల అలంకరించారు. ఈ కార్యక్రమంలో పూర వైస్ చైర్మన్ శ్రీ లక్ష్మి, కౌన్సిలర్లు,మాజీ ఏఎంసి చైర్మన్ పందిరి శ్రీనివాస్, పందిరి రమేష్, పాటీ మాధవరెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, శీల సత్యనారాయణ, గుండెబోయిన సైదులు, పట్టణ ఆర్యవైశ్యులు తదితరులు, నాయకులు పాల్గొన్నారు.
