వాసవి మాత జయంతి అధికారిక నిర్వహణకు సీఎం ఆదేశాలు

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం పట్ల గణేష్ వాకింగ్ టీం అధ్యక్షులు గోనూరు వెంకటయ్య హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో గణేష్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వాకింగ్ టీం సభ్యులు మారం బాలీశ్వరయ్య, కొట్ర కృష్ణమూర్తి, కూన మురళి, సంబు వెంకటేశ్వర్లు, భాస్కర్ రెడ్డి, లగిశెట్టి పాండు, అంగడి యాదగిరి, కలకొండ రవికుమార్, కలకొండ ప్రకాష్, హనుమంతరావు, పుట్నాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఈ నిర్ణయం ద్వారా ఆర్యవైశ్యుల సమాజానికి మరింత గౌరవం దక్కుతుందని, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను సమాజం మొత్తం స్వాగతిస్తుందని నాయకులు తెలిపారు.