22apricartoonstory అమెరికాకు తలనొప్పిగా మారిన ట్రంప్ అత్యుత్సాహం

22apricartoonstory అమెరికాకు తలనొప్పిగా మారిన ట్రంప్ అత్యుత్సాహం

22apricartoonstory రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కథమొదటికి

22apricartoonstory | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏ దేశ అధ్యక్షుడైనా ట్రబుల్ షూటర్ గా ఉండాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటారు. కానీ సాక్షాత్తూ దేశాధ్యక్షుడే ట్రబుల్స్ క్రియేట్ చేయాలని ఏ పౌరులు కోరుకుంటారు? ” మా అధ్యక్షుడేంటీ, ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నాడు? అమెరికన్లిప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ట్యాలెంట్ అంటే మామూలు ట్యాలెంటు కాదండోయ్….పడుకున్నోణ్ణి లేపి మరీ కొట్టించుకునే ట్యాలెంటు

వాళ్ళూ వాళ్ళూ కొట్టుకు చస్తుంటే మధ్యలో దూరిపోయి, యుద్ధాన్ని నెత్తినేసుకుని, కాదు కాదు, అమెరికన్ల నెత్తికేసి రుద్దిన ట్యాలెంట్ …మామూలుదా మరి….ఎరక్కపోయి దిగాక, పోరాడలేక, బయటికి రాలేక, విరమణ పేరుతో, ఇరాన్ ను దయ తలచి విరామం ప్రకటిస్తున్నట్టు బింకం ప్రదర్శించినా, ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే యుద్ధంతో ఇరాన్ కి ఎంత నష్టమో, అమెరికా సైన్యానికీ ఆర్థిక స్థితికీ దెబ్బే అని అందరికీ తెలుసు…పోనీ అంతటితో ఊరుకున్నాడా అంటే…గడువు ముగియక ముందే…తొడగొట్టి వాళ్ళని సంధికి రా రమ్మని పిలిచాడు…

మాతో కాళ్ళ బేరానికి రావడం తప్ప గత్యంతరం లేదంటూ వాళ్ళని రెచ్చగొట్టాడు. వాళ్ళూరుకుంటారా? శాంతీలేదుచర్చల్లేవ్…పొమ్మంటూ మొండికేశారు. ఏముంది? మళ్ళీ కథ మొదటికి…పోరాడలేకా, గెలవలేకా, విరమించుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నవాడు కాస్తా ఇలాంటి అవాకులూ చెవాకులూ పేలడం అవసరమా?

తన దుందుడుకు చర్యలతో, సుంకాల దూకుడుతో, యుద్ధ కాంక్షతో ట్రంపుకెలా ఉందో కానీ…అమెరికాకు మాత్రం అతనిప్పుడు అధ్యడు మాత్రమే కాదు…“తలనొప్పి” అమెరికా అంతటా ఇప్పుడు వినిపిస్తున్న ఘోష…”అతన్నెవరైనా ఆపండ్రా…అతడి నోరు కాస్తా మూయండ్రా…”

click here to read more

click here to read  ట్రంప్ ముందూ వెనకా నుయ్యే…