అయ్యా కాళ్ళు మొక్కుతాం గోనె సంచులు ఇప్పించండి…

అయ్యా కాళ్ళు మొక్కుతాం గోనె సంచులు ఇప్పించండి…

గూడూరు, ఆంధ్రప్రభ : అయ్యా కాళ్ళు మొక్కుతాం బాంచన్ రోజుల తరబడి ఎండలో ఎండుతూ మండుతూ ఉన్నాం గోనెసంచులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం మీరైనా గోనెసంచులు ఇప్పించండి అంటూ ఓ రైతు ఎస్ఐ గిరిధర్ రెడ్డి కాళ్ళ మీద పడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ మక్క రైతులు ఆందోళన నిర్వహించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలోనే ఉంటూ నిరీక్షణ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫైరవిదారులకే గోనె సంచులు ఇస్తున్నారు అంటూ రైతులు మండిపడ్డారు.తక్షణమే గోనెసంచులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రైతులతో మాట్లాడి గోనెసంచులు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇవ్వడంతో సొసైటీ కార్యాలయానికి పోలీసులతో కలిసి రైతులు వెళ్లారు. ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సకాలంలో భువన సంచులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.