Cyber ​​Crime | నల్గొండ యువకుడి అరెస్ట్

Cyber ​​Crime | నల్గొండ యువకుడి అరెస్ట్

Cyber ​​Crime | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన చంటిగా పోలీసులు గుర్తించారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను సహించని అనసూయ, తగిన ఆధారాలతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.

అనసూయ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని ట్రాక్ చేశారు. నిందితుడు చంటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ చేపడుతున్నారు. సోషల్ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply