Karate | బంగారు పతకం..
Karate | బంగారు పతకం..
Karate, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే పోటీలలో బుడ్డ కౌశిక బంగారు పతకం సాధించినట్టు కరాటే మాస్టర్ కోడూరి సాయినాథ్ గౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పలువురు వికారాబాద్ (Vikarabad) జిల్లా మేకవనం పల్లి గ్రామంలో అండర్ 14 విభాగంలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో పాల్గొన్నారు.
ఈ పోటీలలో కౌశిక బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. అంతే కాకుండా ముగ్గురికి సిల్వర్ మెడల్స్, నలుగురికి కాంస్య పథకాలు వచ్చినట్లు ఆయన చెప్పారు. తమ వద్ద శిక్షణ తీసుకున్న కౌశిక రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని.. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని కోరుకుంటున్నట్టుగా మాస్టర్ సాయినాథ్ గౌడ్ చెప్పారు.
