సీఎం చంద్రబాబు బర్త్‌డే గిఫ్ట్…

సీఎం చంద్రబాబు బర్త్‌డే గిఫ్ట్…

భువనేశ్వరి విరాళంతో పేదలకు ఉచిత భోజనం
ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రతి కుటుంబంలో ఆశలు నింపుతున్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే తపనతో ఆయన చేస్తున్న కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని అన్న క్యాంటీన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా కేక్ ను కట్ చేసి, కార్యకర్తలతో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య.

అనంతరం ప్రజలకు ఉచితంగా అన్నాక్యాంటిన్ లో అల్పాహారం అందజేశారు. సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి 76లక్షలు విరాళంగా ప్రకటించగా, ఆ నిధులతో దాదాపుగా 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించాలని ఏర్పాట్లు చెయ్యడం జరిగింది.

సాధారణంగా ఐదు రూపాయలకే లభించే ఈ భోజనం, ఈ ఒక్కరోజు మాత్రం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉచితంగా అందనుంది. అలాగే, ప్రజాసేవనే ధ్యేయంగా తీసుకుని ముందుకు సాగుతున్న ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండి ఇంకా ఎన్నో విజయాలు సాధించి ప్రజలకు మరింత సేవలు అందించాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు.

Leave a Reply