టీటీడీకి రూ.కోటి విరాళం

టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల, ఆంధ్రప్రభ : హైదరాబాద్ కు చెందిన వై.కె.డి మల్లికార్జునరావు అనే భక్తుడు తన కుటుంబ సభ్యుల పేరుతో సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.25 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందజేశారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీలను అందజేశారు.
