ఉడుంపూర్ లంబాడి తాండాలో ఉచిత వైద్య శిబిరం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలోని లంబాడి తాండాలో శనివారం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. దస్తురాబాద్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు, ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్త ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించడంతో పాటు మలేరియా నిర్ధారణ కోసం రక్త పరీక్షలు చేశారు. గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత, వ్యాధి నివారణ చర్యలు, వడదెబ్బ నుంచి రక్షణ, దోమల నియంత్రణపై అవగాహన కల్పించారు. గ్రామంలో మురికి నీటి కుంటల వద్ద దోమల నివారణ కోసం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా మందు పిచికారీ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగవత్ సరిత, పంచాయతీ కార్యదర్శి ఎన్. వినోద్ కుమార్, నిర్మల్ మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ మహేందర్, హెల్త్ సూపర్వైజర్లు లలిత, సంతోష్, హెల్త్ అసిస్టెంట్లు మల్లేష్, రాజేశ్వర్, నరసయ్య, భూమేష్, కొమురయ్య, ఏఎన్ఎం రత్నమాల, ఆశా వర్కర్ లలిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply