Social Media | ‘చిరుత’ భామ గ్లామర్ షోకి ఫ్యాన్స్ ఫిదా!

Social Media | ‘చిరుత’ భామ గ్లామర్ షోకి ఫ్యాన్స్ ఫిదా!

Social Media | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘చిరుత’తో రామ్ చరణ్ పక్కన మెరిసిన నేహాశర్మ తాజాగా తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తడిసిన జుట్టుతో నేహా ఇస్తున్న స్టిల్స్ చూస్తుంటే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందమైన రిసార్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె గ్లామర్ చూసి నెటిజన్లు ‘సూపర్’ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన ఈ భామ 2007లో ‘చిరుత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌పై కన్నేసి ఇమ్రాన్ హష్మీ సరసన ‘క్రూక్’తో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘క్యా సూపర్ కూల్ హై హమ్’, ‘తుమ్ బిన్ 2’, ‘తానాజీ’ వంటి సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాదు, ‘ఇల్లీగల్’ వంటి వెబ్ సిరీస్‌లతో డిజిటల్ దునియాలోనూ సత్తా చాటుతోంది.

ప్రస్తుతం నేహా అటు సినిమాలు, ఇటు వెబ్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీ. మొన్నటికి మొన్న ‘గ్రాజియా ఫ్యాషన్ అవార్డ్స్ 2026’లో తన చెల్లెలు ఆయిషా శర్మతో కలిసి రెడ్ కార్పెట్‌పై అదిరి పోయే లుక్‌లో సందడి చేసింది. కేవలం నటనలోనే కాదు, ఫ్యాషన్ విషయంలోనూ నేహాకు సాటిలేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది.

అందంతో పాటు అభినయం ఉన్న ఈ ‘చిరుత’ పిల్లకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు మరి!

Social Media
Social Media
Social Media
Social Media
Social Media
Social Media
Social Media
Social Media
Social Media

Leave a Reply