రాంపూర్‌లో చలివేంద్రం ఏర్పాటు..

రాంపూర్‌లో చలివేంద్రం ఏర్పాటు..
నల్లబెల్లి,(ఆంధ్రప్రభ) వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాంపూర్ గ్రామ పంచాయితీ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు,గ్రామస్తులు, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు,కట్టెకోల భద్రమ్మ, నారాయణ గౌడ్ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కట్టెకోల సోమన్న గౌడ్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు,ప్రస్తుతం ఈ సదుపాయం ద్వారా గ్రామ ప్రజలతో పాటు ప్రయాణికులు కూడా చల్లని తాగునీటిని సులభంగా పొందుతున్నారు,ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సోమన్న గౌడ్ చేసిన సేవను అభినందించారు,తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు,రాంపూర్ సర్పంచ్ పురం భాస్కర్, గ్రామ పంచాయితీ కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో అంబటి శ్రీనివాస్ రెడ్డి, మహిళా సంఘం సభ్యురాలు మహమ్మద్ మున్నీసా బేగం, మామిడిపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
