ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం..

ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పి వేయడం ప్రధాన కర్తవ్యమని ఎన్‌టీపీఎస్ చీఫ్ ఇంజనీర్ పి.శివ రామాంజనేయులు అన్నారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎన్టీటీపీఎస్ స్టేజ్ – 4లో సర్వీస్ బిల్డింగ్ వద్ద అగ్నిమాపక దళ విన్యాసాలను సీఈ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుతున్న బొగ్గుతో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రమాదం పసిగట్టగానే ఫైర్ అలారం మోగించాలని సూచించారు. అందుబాటులో ఉన్న అగ్ని ప్రమాద సాధనాలతో మంటలను ఆర్పి వేయాలన్నారు. మంటలను ఆర్పడం సాధ్యం కాదని తెలిసినప్పుడు ప్రాంతం నుంచి బయటకు వచ్చేయాలని చెప్పారు. భద్రతాధికారి నాగబాబు ఉద్యోగులతో పోర్టబుల్ సిలిండర్లు ఉపయోగించి మంటలను ఏ విధంగా ఆర్పవచ్చో ప్రాక్టీస్ చేయించారు. కార్యక్రమంలో ఇంజనీర్లు, ఓ అండ్ ఎం సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply