Delimitation | స్టాలిన్ వార్నింగ్

Delimitation | స్టాలిన్ వార్నింగ్
Delimitation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంలో రాజ్యాంగ సవరణను బలవంతంగా అమలు చేయొద్దని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌పై కేంద్రం బలవంతంగా రాజ్యాంగ సవరణ చేయాలని చూస్తోందని ఆరోపించారు.
ఈ అంశంపై తాము మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నామని స్టాలిన్ తెలిపారు. ఈ సమస్యతో ప్రభావితమయ్యే రాష్ట్రాలన్నీ కలసి చెన్నైలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ప్రధాని పార్లమెంట్‌లో స్పష్టమైన హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు. ఈ మేరకు స్టాలిన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వీడియో విడుదల చేసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
