ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కొత్తూరు, ఆంధ్రప్రభ : అందరికీ ఆదర్శం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితమని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జాండగూడెం సుదర్శన్ గౌడ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా షాద్ నగర్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కర్రోళ్ల సురేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని, అంబేద్కర్ జీవితం, ఆయన రచనలను నేటికి ఎందరికో, ఎంతగానో స్పూర్తినిస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జె.సుదర్శన్ గౌడ్, మండలాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి , నాయకులు జనిగె జగన్, ఇందూరి శ్రీనివాస్, సత్తయ్య, చిల్కమర్రి నర్సింహ, కర్రోళ్ల లక్ష్మయ్య, గోవింద్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, జోగు బాలరాజ్, రమేష్, అంజి నాయక్, రమేష్, శంకర్, రవీందర్, ఈశ్వర్, శ్రీను, శివశంకర్ గౌడ్, బబ్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
