కొండపల్లి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా విజయ..

కొండపల్లి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా విజయ..

టీడీపీలో చురుకైన, నిబద్ధత కలిగిన కార్యకర్తగా గుర్తింపు
పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె కుటుంబం టీడీపీతోనే

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా చినుకుని విజయ నియమితులయ్యారు. సోమవారం రాత్రి జరిగిన కొండపల్లి పట్టణ టీడీపీ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. అన్న నందమూరి తారకరామారావుపై అభిమానంతో విజయ తండ్రి కంపా గురవారెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి తుదిశ్వాస వరకు టీడీపీలో కొనసాగారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న విజయ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఆమె నిబద్ధతను మెచ్చిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ తమ కుటుంబం మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతూ సేవలందిస్తుందని చెప్పారు. తన సేవలను, నిబద్ధతను గుర్తించి పదవి కట్టబెట్టడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో తెలుగు మహిళ సంఘాన్ని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply