నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త ఆంటోనీ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌లోని శంషాబాద్ గల ‘ఫోర్ట్ గ్రాండ్’లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మన్నె నరసింహారెడ్డి, మల్లెపల్లి ప్రముఖ రెడ్డి, సిలివేరు శ్రీనివాస్ తదితరులు ఈ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను అక్షింతలు వేసి దీవించారు.
