పోలీసులకు స్పెషల్ లీవ్స్.. ఏపీ డీజీపీ కీలక ఉత్తర్వులు

పోలీసులకు స్పెషల్ లీవ్స్.. ఏపీ డీజీపీ కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీపి కబురు అందించింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్ అధికారి లేదా సిబ్బంది తమ పుట్టినరోజు (Birthday) పెళ్లిరోజు (Wedding Anniversary) నాడు ఈ ప్రత్యేక సెలవును ఇవ్వాలని ప్రకటన చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అన్ని ర్యాంకుల పోలీసు సిబ్బందికి ఈ సెలవులు వర్తిస్తాయి.

అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ విభాగాల అధిపతులు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని డీజీపీ ఆదేశించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తరచుగా పండుగలు, పబ్బాలు మరియు తమ కుటుంబ వేడుకలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, కనీసం వారి జీవితంలోని ముఖ్యమైన రోజుల్లో కుటుంబంతో గడిపే అవకాశం కల్పించడం వల్ల వారిలో మానసిక ఉల్లాసం పెరుగుతుందని, తద్వారా వారు మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply