త్రాగునీరు రాని నల్లాలు పరిశీలించిన కార్పొరేటర్…

త్రాగునీరు రాని నల్లాలు పరిశీలించిన కార్పొరేటర్…

సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను
నేడు నిర్వహించే గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేస్తాను

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్ లో త్రాగునీరు సక్రమంగా పంపిణి గాని గృహాలలోని కుళాయిలను ఆదివారం 35 వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఇటీవల శివనగర్లో మెరుగైన తాగునీరు అందించేందుకు నూతనంగా పైపులైన్లు వేయడం జరిగింది. నూతన పైపులైను వేయడంతో గత 15 రోజుల క్రితం సక్రమంగా భగీరథ త్రాగునీరు సరఫరా అయ్యే వీధుల్లో నీరు పంపిణీ నిలిచిపోయింది.

నూతన పైపులైను వేస్తే గతం కన్నా మెరుగైన నీరు సరఫరా అవుతుందని భావించిన డివిజన్ ప్రజలకు కొండి నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఓడిపోయింది అనే చందనంగా వచ్చే నీరు సరఫరా నిలిచిపోయింది. దీంతో డివిజన్ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివనగర్ వాటర్ ట్యాంక్ నుండి సరఫరా అయ్యే సిబ్బందిని భగీరథ నీరు ఇబ్బందుల గురించి ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో.35,34డివిజన్ ప్రజలు కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకుని రాగా త్రాగునీరు సరఫరా అవుతున్న సమయంలో ఎవరెవరి గృహాలలోకుళాయి వాటర్ సరఫరా కావడం లేదు.

వారి గృహాలు సందర్శించి నీరు రాని గృహాల ఇంటి నెంబర్లు గృహిజమానుల పేర్లు సేకరించి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి, నేడు నిర్వహించే గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేస్తానని నీరు రాని బాధితులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట వాటర్ ట్యాంక్ నీరు పంపిణీ చేసే, వాటర్ వర్క్స్ సిబ్బంది ఏకాంబరం, అశోక్ పాల్గొన్నారు.

Leave a Reply