రాఘవేంద్ర కరిమల కళాశాల ఇంటర్ ఫలితాల ప్రభంజనం

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మంచి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు.ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థి బురగడ్డ అఖిల్ గౌడ్ 470 మార్కులగాను 457 మార్కులు సాధించి రాష్ట్రం స్థాయి ర్యాంకు సాధించారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర,జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి దాసరి కార్తీక్ 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి రాష్ట్రంలో పదో ర్యాంక్ పొందారు.అదేవిధంగా మోవారి ఆకాష్ 981 మార్కులు, గుమ్మడి మేఘన 965 మార్కులు, రాగుల అక్షయ 947 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ద్వితీయ సంవత్సరంలో బీపీసీలో సాంబారు శివాని 956 మార్కులు సాధించి మండల టాపరుగా నిలిచారు. మాటూరి వైష్ణవి 944 మార్కులు సాధించి రెండొ స్థానం కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ మాట్లాడుతూ,గత 32 సంవత్సరాలుగా విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల తరహాలో చక్కని బోధన చేయడం వల్లనే ఈ ఫలితాలు రావడం జరిగిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటీ, నీట్ తరహా పరీక్షలు రాయడానికి అన్ని విధాల విద్యార్థులను సంసిద్ధులను చేయనున్నట్లు ఆయన తెలిపారు.ఆ విద్యార్థులందరినీ రాఘవేంద్ర విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎర్ర సంపత్,డీన్ హేమలత షిండే, ప్రిన్సిపాల్ ఎదులాపురం లక్ష్మణ్, అధ్యాపక బృందం అభినందించారు.
