Registration | జులై 3 నుంచి ప్రారంభం

Registration | జులై 3 నుంచి ప్రారంభం

Registration | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర 57 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 28న ముగుస్తుంది. ఏప్రిల్ 15 నుంచి యాత్రకు రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది. దేశవ్యాప్తంగా సుమారు 556 గుర్తింపు పొందిన బ్యాంక్ శాఖల ద్వారా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు. అదే విధంగా, శ్రీ అమర్‌నాథ్‌ జీ పుణ్యే క్షేత్ర బోర్డు మండలి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సహకారం అందిస్తాయి. యాత్రలో పాల్గొనే భక్తులకు కనీస వయస్సు 13 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 70 సంవత్సరాలుగా నిర్ణయించారు.

Leave a Reply