హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ..

హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించే ఉప మండల స్థాయి హిందూ సమ్మేళనంలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్ఎస్ఎస్ కృష్ణయ్య జీ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ కృష్ణయ్య జీ మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీన జరగనున్న చౌటుప్పల్ ఉప మండల స్థాయి హిందూ సమ్మేళన కార్యక్రమంలో హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హిందూ సమ్మేళనం కార్యక్రమంను విజయవంతం చేయడం కోసం 51 మందితో హిందూ సమ్మేళన సమితిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక నిర్వహణ అంశాలు చర్చించారు. హిందూ సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసనం రామిరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాస్, బడుగు శ్రీరాములు, భీమిడి మోహన్ రెడ్డి, బాల్యం వెంకటాచలపతి, కర్నాటి శ్యాంప్రసాద్, ఉప్పల కృష్ణ, మునుకుంట్ల సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
