మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం..

మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం..

  • బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ.

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని సామాజిక అసమానతలను తొలగించడమే పూలే ఆశయమని బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగరావునామాజీ, ఊట్కూర్ సర్పంచ్ రేణుక భరత్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొక్కుశంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా జోగిని వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ హాజమ్మ, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్, అంబేద్కర్ సంఘం కార్యదర్శి కొండన్ భరత్, అంబేద్కర్ సంఘం నాయకుడు అశోక్ అన్నారు.

శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిబాపూలే జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జ్యోతిబా పూలే సమాజంలో సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.విద్యా విస్తరణసామాజిక సంస్కరణల కోసం చేసిన కృషిని కొనియాడారు.

సామాజిక సంస్కరణ అంటరానితనం, కుల ఆధారిత అణచివేత, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిమహిళలు నిమ్న కులాల వారి విద్యను ప్రోత్సహించారుసత్యశోధక్ సమాజ్ అణగారిన కులాల ప్రజలకు సమాన హక్కులు సాధించడం కోసం 1873లో స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కు మల్లేష్, సంఘ సభ్యులు, సురేష్,తిమ్మప్ప కొక్కుల నరసింహులు, బలరాం, భీమ్ రాజు, నాగరాజ్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

చిన్న పొర్లలో పూలేకు ఘనంగా నివాళులు

ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు తెలంగాణ వ్యవసాయ వృత్తి దారుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ రాములు, మండల కోఆర్డినేటర్ మానస, యూత్ కోఆర్డినేటర్ కవిత ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే చేపట్టిన సేవలు గుర్తు చేశారు.

Leave a Reply