Thati Munjalu |ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌నక‌రం

Thati Munjalu |ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌నక‌రం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వేస‌వి కాలం వ‌చ్చేసింది. భానుడు భ‌గ‌భ‌గ మండుతున్నాడు. అధిక ఉష్ణోగ్ర‌త‌లు నమోద‌వుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ వేడికి జనం బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. అయితే వేస‌విలో బాడీ డీహైడ్రేట్ కాకుండా ప్రకృతి వరప్రసాదమైన‌ తాటి ముంజలను తింటే ఎంతో ఉపశమనంగా ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో తాటి ముంజలు విరివిగా ల‌భిస్తాయి. కొబ్బరిలా తియ్యగా, రుచిగా ఉండే వీటిని తిన‌డానికి ప్ర‌తీఒక్క‌రు ఇష్ట‌ప‌డ‌తారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వీటిని తిన‌డానికి ఆస‌క్తి చూపుతారు. నీటి శాతం ఎక్కువగా ఉండే తాటి ముంజల‌ను తింటే డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. తాటి ముంజల్లో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం కూడా ల‌భిస్తుంది.

  • తాంటి ముంజ‌లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ, ఎండ వేడి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
  • మలబద్ధకం, ఎసిడిటీ, గర్భధారణ సమయంలో వచ్చే వాంతులను తగ్గిస్తాయి.
  • తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహులకు (మితంగా) ఇవి మంచి ఆహారం.
  • వీటిల్లో శరీరానికి కావాల్సిన నేచురల్ ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, చక్కెరలు ఉంటాయి.
  • ఇవి శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తాయి.
  • ముంజల్లో A, C, E, K విటమిన్లతోపాటుగా B-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది.
  • ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు దండిగా ఉంటాయి.
  • కాలరీలు తక్కువగా ఉంటాయి.. ఇవి బరువు తగ్గాలని కోరుకునేవారు తిన‌వ‌చ్చు.
  • ఎండాకాలంలో కలిగే డీహైడ్రేషన్‌ను నివారించి, శరీరాన్ని చల్లబరుస్తాయి.
  • కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
  • ముంజలలోని నీటి శాతం చర్మాన్ని తేమగా ఉంచి, ఎండ దెబ్బ నుండి రక్షిస్తుంది.
  • ఇందులో ఉండే విటమిన్లు ఇమ్యూనిటీని పెంచుతాయి.
  • రోజుకు 3-4 ముంజలు తినడం మంచిది. ఎక్కువగా తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
  • ముంజల పైన ఉండే పల్చటి పొట్టుతో కలిపి తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
  • ఇది సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
  • పాలిచ్చే తల్లులకు కూడా ఇవి చాలా మంచిదదని నిపుణులు చెబుతున్నారు. పాల ఉత్పత్తి పెరగడానికి ఇవి సహాయప‌డుతోంది.
  • ఎండా కాలంలో వేధించే చర్మ సమస్యలు, అలర్జీలను నివారించడానికి కూడా ఇవి నేచురల్ మెడిసిన్ మాదిరిగా పనిచేస్తాయి.