today gold rate| మళ్లీ మొదలైన పసిడి పరుగు

today gold rate| మళ్లీ మొదలైన పసిడి పరుగు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఇవాళ కూడా పెరిగాయి. రెండు రోజులుగా ఒక్కసారిగా ధరలు హైక్ అయ్యాయి. మొన్నటివరకు ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి, ట్రంప్ ప్రకటనలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం బంగారం ధరలపై పడింది. శనివారం బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.

హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 వద్ద కొనసాగుతోంది. ఇక నిన్న రూ.1,52,350గా ఉండగా.. నిన్నటితో చూసుకుంటే రూ.490 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర ప్రస్తుతం రూ.1,40,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,39,650 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.450 పెరిగిందని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు చూస్తే.. ముంబైలో కిలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి రూ.2.65 లక్షల వద్ద ఉంది.

