సంబాజీగూడాలో రోడ్డు ప్రమాదం..

సంబాజీగూడాలో రోడ్డు ప్రమాదం..
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి
- మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లోని సంబాజి గూడ సమీపంలో శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడం తో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జైనూర్ వైపు నుండి ఆసిఫాబాద్ వైపు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదం విషయాన్ని తెలుసుకుని వాహనాన్ని ఆపి గాయాలపాలైన క్షతగాత్రులను పరమర్శించారు.
వెంటనే ఎమ్మెల్యే ఫోన్ ద్వారా108 వాహనం కు సమాచారం చేరవేసి సకాలంలో ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మానవత్వం చాటుకున్నారు. వెంటనే ఫోన్ ద్వారా వైద్యాధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉట్నూరు వైద్య అధికారులకు కోరారు అవసరమైతే రిమ్స్ ఆస్పత్రికి తరలించాలని ఎమ్మెల్యే వైద్య అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు ఉన్నారు.
