ప్రమాదవశాత్తు అశ్రమ విద్యార్థి మృతి

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పానపటార్ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల చెందిన నాలుగో తరగతి విద్యార్థి దుర్వా అన్వేష్ (10) ప్రమాదవశాత్తు మృతి చెందారు. జైనూర్ క్లస్టర్ ఏ టి డి ఓ శ్రీనివాస్ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరా సింగ్ తెలిపిన వివరాలు ప్రకారంగా వసతి గృహంలో విద్యార్థులు నిద్రిస్తున్న బెడ్డుకు ఉయ్యాల కట్టుకొని ఆడుతుండగాశుక్రవారం సాయంత్రం కిందపడి ఆ గదిలో ఉన్న బాక్స్ కు తగలడంతో తలకు తీవ్ర గాయాలు కాగా జైనూర్ ఆ సుపత్రికి సాయంత్రం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యాధికారి అశోక్ తెలిపారు.
ఈ విషయం తెలియగానే ఆసుపత్రికి ఆశీర్ గ్రంధాలయ మాజీ చైర్మన్ కనకయ్య యాదవ్ ఆదివాసి నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థి మృతి కి తెలుసుకొని అ విద్యార్థి మృతి పట్ల ప్రగడ సానుభూతి తెలియజేస్తూ ఐటి డి ఏపరంగా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు పదిలక్షలు ఇవ్వాలని ఆస్పత్రి ముందు ఆదివాసీ నాయకులు అధికారులకు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏటిడిఓ శ్రీనివాస్ అధికారులు మాట్లాడుతూ తగు న్యాయం చేస్తామని తమ డిమాండ్ల విషయంలో ఉన్నతఅధికార ల దృష్టి తీసుకు వెళ్తామని అన్నారు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మాజీ గ్రంథాలయ చైర్మన్ తో పాటు పాన పటాస్ సర్పంచ్ ఆత్రం తులసి శంకర్ మృతి చెందిన విద్యార్థి తండ్రి బంధువులు అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.
జైనూర్ ఎస్సై రవికుమార్ మృతి గల కారణాలు అడిగి తెలుసుకుని మృతిని బంధువులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదవశుద్ధి జరిగిన సంఘటన విషయంలో మృతిని బంధువులకు నాయకులతో ఎస్సై రవికుమార్ మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన కారణాలను పాన పటార్ హెచ్ఎం తోపాటు పోచంలది హెచ్ఎం కురుషాంగ భీoరావు ఎస్సై రవికుమార్ కు వివరించారు.
