సీనియర్ జర్నలిస్ట్ బుర్ల వెంకటేశం మృతి

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేసిన బుర్ల వెంకటేశం ఆ పత్రికకు అందించిన సేవలు ఎంతో గొప్ప వని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఆంధ్రప్రభ జర్నలిస్ట్ వెంకటేశం అనారోగ్యంతో మృతి చెందారు. 1978 నుండి సుదీర్ఘకాలం పాటు ఆయన స్థానిక ఆంధ్ర ప్రభ విలేకరిగా పనిచేశారు. ఆంధ్రప్రభ లో వస్తున్న కథనాలను ప్రజలకు వివరిస్తూ అందరి మన్ననాలు పొందారు. అప్పటి రోజుల్లో ఆంధ్రప్రభ పత్రికకు ఉన్న ప్రాధాన్యతను ప్రస్తుతం ఉన్న నాయకులు మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న నాయకులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్లి మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రభ దినపత్రికకు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన మృతి చెందడం ఎంతో బాధకరమని ఈ సందర్భంగా నాయకులు అన్నారు వెంకటేశం అంటేనే ఆంధ్రప్రభ దినపత్రిక అని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను ఆంధ్రప్రభ దినపత్రిక ఆకర్షించుకుంటుందని గుర్తు చేశారు.

అప్పటి రోజుల్లో ఆంధ్రప్రభ ఎన్నో కథనాలను ప్రచురించి ప్రజాదారణ పొందిందన్నారు .ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరిగినప్పటికీ అప్పటి ఆంధ్ర ప్రభ ఇప్పుడు సమాజంలో పలు విభాగాలలో ముందుకు పోవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. వెంకటేశం ఆంధ్రప్రభ కు అందించిన సేవలు ఎంతో గొప్ప వని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మండల కేంద్రంలో జరిగిన అంత్యక్రియల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అధికారులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply