వినతి పత్రానికి స్పందించిన సింగరేణి అధికారులు

వినతి పత్రానికి స్పందించిన సింగరేణి అధికారులు

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ ఎర్రవెల్లి కృష్ణవేణి నరేష్ రావు, చిల్లపల్లి గ్రామ సర్పంచ్ గోపు సంతోష్ ల వినతి పత్రానికి సింగరేణి అనే అధికారులు స్పందించారు. గురువారం మంథని మండలం దుబ్బపల్లి, చిల్లపల్లి గ్రామాలను సింగరేణి అధికారులు సందర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామాలలో ఉపాధి పథకం ఏర్పాటు చేస్తామని సింగరేణి అధికారులు తెలియజేశారు.

జిఎం లలిత కుమార్ ఆదేశాల మేరకు ఫారెస్ట్రీ డిజిఎం బానోతు కర్ణ ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు గ్రామంలో సందర్శించి ప్రజలకు ఉపాధి కల్పించే కార్యక్రమాల పట్ల ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. వినతి పత్రం స్పందించి గ్రామానికి వచ్చిన సింగరేణి అధికారులను సర్పంచులు, గ్రామస్తులు ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.

ఈ సందర్భంగా సింగరేణి అధికారులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పర్యావరణ రక్షించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగం అవ్వాలని తెలిపారు. గ్రామస్తుల ఉపాధి చర్యలకు సింగరేణి అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుడుదుల రవి, నరేష్ రావు, గ్రామస్తులు, సింగరేణి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply