నేడు రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికలు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జిమ్నాస్టిక్స్ పోటీలు మరియు జూనియర్, సీనియర్ విభాగాల్లో జాతీయస్థాయి ఎంపికల కోసం నిర్వహించే పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపికలు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా జిమ్నాస్టిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి కిరణ్, కార్యదర్శి డాక్టర్ స్వామి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 11, 12 తేదీలలో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జిమ్నాస్టిక్స్ పోటీలు, అలాగే జూనియర్, సీనియర్ విభాగాల్లో జాతీయస్థాయి ఎంపికలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపికలు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు, క్రీడాకారిణులు ఈ ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు 9849193002, 9866064263 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply