గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు
కోటపల్లి, ఆంధ్రప్రభ : కోటపల్లి మండలంలోని దేవల్వాడ గ్రామంలో గురువారం ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గంజాయి, మత్తుపధార్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గంజాయి, మత్తుపధార్తాలు మీ ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబాన్ని నాశనం చేస్తాయని, వాటిపట్ల దూరంగా ఉండాలని అన్నారు.

గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా 2000లీటర్ల బెల్లపు పానకం, 70 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసారు, సరైన పత్రాలు లేని 37 వాహనాలు సీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ సీఐ ఆర్ బన్సిలాల్, చెన్నూర్ రూరల్ సీఐ ఆర్ కృష్ణ, కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, చెన్నూర్ ఎస్ఐ సుబ్బారావు, నిల్వాయి ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు,
