గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి
గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి
- సారంగాపూర్ సర్పంచ్ కోల తేజస్విని
కడెం, ఆంధ్రప్రభ : గర్భిణీ మహిళలు, బాలింతలు తప్పనిసరిగా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సారంగాపూర్ సర్పంచ్ కోల తేజస్విని శ్రీనివాస్ సూచించారు.
మండలంలోని సారంగాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లుల సమావేశం, పిల్లల కోసం ఏఎల్‌ఎంఎస్ కమిటీ సమావేశం స్థానిక సర్పంచ్ కోల తేజస్విని అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రభుత్వం ద్వారా పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం, ఆటపాటల ద్వారా విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ప్రభుత్వం నుండి మంజూరైన బాలమృతం ప్యాకెట్లు, గుడ్లను సర్పంచ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమ్మరి రమేష్, వార్డు సభ్యులు కోడిమెల శిరీష, మార్కపు భూలక్ష్మి, వీవో లీడర్లు లావణ్య, జెట్టి గంగవ్వ, సభ్యులు, అంగన్‌వాడీ టీచర్ ఇందిర, హెల్పర్ ప్రేమల, గర్భిణీ మహిళలు, బాలింతలు, పిల్లల తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
