ఆత్మహత్యాయత్నం నుంచి రక్షించిన పోలీస్ అక్కలు

ఆత్మహత్యాయత్నం నుంచి రక్షించిన పోలీస్ అక్కలు

బాసర ( నిర్మల్ జిల్లా) ఆంధ్ర‌ప్ర‌భ : నిజామాబాద్‌కు చెందిన ఒక మహిళ తన భర్తతో జరిగిన కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్లిపోయింది. అనంతరం బాసర గోదావరి నదిలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. డయల్ 100 సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీస్ అక్క (నారిశక్తి) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, అప్రమత్తంగా వ్యవహరించి ఆ మహిళను ఆత్మహత్య కు పాల్పడకుండా ప్రాణాలను కాపాడారు. అనంతరం మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ మాట్లాడుతూ…

సమయోచితంగా స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన పోలీస్ అక్కలను (నారిశక్తి) బృందాన్ని అభినందించారు. పోలీస్ అక్క (నారిశక్తి),మహిళల భద్రత కోసం మాత్రమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీస్ అక్కలు దీపిక,సుమేర లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply