పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సహకరించండి..

పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సహకరించండి..

  • ఎంపీని కలిసిన ప్రిన్సిపల్, అధ్యాపకులు

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సహకరించాలని కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకుల బృందం ఎంపీ కావ్యకు విజ్ఞప్తి చేశారు. పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బేతి సంతోష్ కుమార్, కళాశాల అధ్యాపక బృందం బుధవారం ఎంపీ డాక్టర్ కడియం కావ్యను కలిసి పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తమవంతు సహకారం అందించాలని, ఇందుకు అవసరమైన నిధులను ఎంపీ లాండ్స్ నుంచి సమకూర్చి అభివృద్ధిలో సహకారం అందించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్ మల్లయ్య, స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎలిషాల అశోక్, అధ్యాపకులు డాక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ భీమ్ రావు, డాక్టర్ ఆడెపు రమేష్, డాక్టర్ జి రాజేశ్వర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply