వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం
టీఆర్ఎస్ పార్టీ కుటుంబ తగాధలతో సతమతం
బీజేపీ పేదలకు చేసింది ఏమీ లేదు
ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నాం
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుపోతుంది
మహబూబ్‌నగర్ జిల్లాపై పార్టీకి ప్రత్యేక కమిట్మెంట్ ఉంది
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం చేస్తాం
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి
ప్రభుత్వం పార్టీ సమన్వయంగా ముందుకు సాగాలి
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, 100 స్థానాలు గెలుస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ తగాదాలతో సతమతమవుతున్నదని బావ బామ్మర్దులు పదవుల కోసం తగాదాపడుతున్నారని కూతురు వేరే కుంపటి పెట్టుకున్నారని, తండ్రి ని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదని బిజెపి పార్టీ రెండున్నర సంవత్సరాలలో పేదలకు చేసింది ఏమీ లేదని ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని 100 సీట్లతో మళ్లీ ప్రభుత్వం చేపడతామని మహేష్ కుమార్ గౌడ్ తన విశ్వాసాన్ని ప్రకటించారు.
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన డిసిసి కార్యాలయం ప్రారంభం, జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అచ్చంపేట శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు ఈ సభలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని సంక్షేమం అభివృద్ధి నినాదంతో ఆ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన వివరించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నామని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ,రేషన్ కార్డులు, పెన్షన్లు, మహాలక్ష్మి పథకం ఇలా అన్ని అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు కెసిఆర్ పాలనలో జలదోపిడి జరిగిందని కాలేశ్వరం సంగతి అందరికీ విధితమేనని అన్నారు మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం సంపూర్ణంగా సస్యశ్యామలం చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జాతీయ హోదా కావాలని పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తున్నామని అన్నారు.

విభజన హామీలు నెరవేర్చాలని విషయంలో జాతీయ హోదాపై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై బిజెపికి ఉలుకు పలుకు లేదని ఎద్దేవా చేశారు. సంపూర్ణంగా కృష్ణాజిల్లాలు వాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లా వాసి అయిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి లక్ష్యంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని మేటి జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శాశ్వతమని కాంగ్రెస్ ప్రజాసేవని ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని సంక్షేమం అభివృద్ధి ఫలాలను బూత్ స్థాయిలో గ్రామాలలో ప్రజలకు చెప్పాలని తెలిపారు.
2003 నుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పాలనలో లాటీలు తినడం జైళ్లకు వెళ్లడం బయటాయింపులు చేయడం ఇలా అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు 72 శాతం పదవులు ఇచ్చిందని జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ పలాలు అందించుటకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ జూడో యాత్ర తర్వాత కులగనన చేయడం జరిగిందని దానిని దేశంలో రోల్ మోడల్ గా రాష్ట్రంలో చేపట్టడం జరిగిందని చెప్పారు .
పార్టీ నిర్మాణం కోసం సమర్థవంతంగా శక్తివంతం లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. నామినేటెడ్ పోస్టులు కూడా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాటిని క్రమక్రమంగా భర్తీ చేస్తున్నామని పార్టీలో పని చేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని వారికి అవకాశాలు వస్తాయని మహేష్ కుమార్ గౌడ్ అనేక అనుభవాలను వివరిస్తూ భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త నాయకుడు ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సి డబ్ల్యూ సి సభ్యులుసచిన్ సావంత్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిఓబిసి జాతీయ నాయకులు కేతురు వెంకటేష్ గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ జెడ్పి మాజీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ మహిళా నాయకురాలు సంధ్య రెడ్డి ఇందిరా శోభన్ తదితరులు పాల్గొన్నారు.
