Polycet-2026 | 9 వరకు అప్లై చేసే అవకాశం..

Polycet-2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాలిసెట్-2026 దరఖాస్తు గడువును రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు పొడిగించింది. అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ గడువును ఐదు రోజుల పాటు పెంచింది.
వాస్తవానికి పాలిసెట్-2026 దరఖాస్తు గడువు ఈ నెల 4వ తేదీతో ముగిసింది. అయితే ఇంకా అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదని గుర్తించిన అధికారులు గడువును పొడిగించాలని నిర్ణయించారు.
ఈ మేరకు అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు అప్లై చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు సూచించింది.
