డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం..

డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం..
- చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో.
- దట్టమైన పొగ మంచులో శివునేనిగూడెం
- ఒకసారి గా ఉలిక్కిపడ్డ శివ నేని గూడెం ప్రజలు..
- దట్టమైన మంటలు పొగతో ఇబ్బంది పడ్డ ప్రజలు
- ఫైర్ ఇంజన్ తో భారీ అగ్ని ప్రమాదాన్ని కట్టడి
- తక్షణమే స్పందించిన మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఒకటో వార్డులో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి వెలువడుతున్న దట్టమైన పొగతో శివునేనిగూడెం గ్రామం పూర్తిగా కమ్మేసింది. అకస్మాత్తుగా వ్యాపించిన పొగ కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్‌లో నిల్వ ఉన్న ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాలకు మంటలు అంటుకోవడంతో, అవి వేగంగా విస్తరిస్తున్నాయి.

గాలి దిశ శివునేనిగూడెం వైపు ఉండటంతో, గ్రామం మొత్తం పొగ నిండిపోయింది. స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకటో వార్డ్ కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ వెంటనే స్పందించి చైర్మన్ పందిరి గీతకు సమాచారం ఇవ్వడంతో చైర్మన్ పందిరి గీత సుమారు రాత్రి 11 గంటల దాకా చైర్మన్ పర్యవేక్షణలో వాటర్ ట్యాంకర్, అగ్ని మా పక పైరింజన్ తో భారీ అగ్ని ప్రమాదాన్ని కట్టడి చేశారు. దీంతో వార్డు ప్రజలు ఊపిరి పిలుచుకొని చైర్మన్ ని కౌన్సిలర్ ని స్పందించినందుకు అభినందనలు తెలిపారు.

