దేశ సమగ్రత, సంస్కృతి విలువలు కాపాడడం బీజేపీకేసాధ్యం…

దేశ సమగ్రత, సంస్కృతి విలువలు కాపాడడం బీజేపీకేసాధ్యం…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశ సమగ్రత నైతిక విలువలు సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటం బిజెపి కే సాధ్యమని బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్, ఊట్కూర్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. సోమవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీచేసిసంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారనిఅన్నారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ భారతదేశన్ని శక్తివంతమైన దేశంగాఅభివృద్ధి చెందుతుందనిఅన్నారు. ప్రతి నాయకులుకార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలనిపిలుపునిచ్చారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ కృష్ణయ్యగౌడ్, మాజీఎంపిటిసి హన్మంతు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ మాజీ మండల అధ్యక్షులు రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ శంకర్ గౌడ్, బాలాంజనేయులు, తారాకృష్ణ, అమీర్,రవి, తిమ్మప్ప నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
