రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగండ్ల వాన.!

రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగండ్ల వాన.!
- వడగండ్ల వానకు నెలరాలిన వరి ధాన్యం.
- 2 వందల ఏకరాలపై నష్టపోయిన వరి సాగు రైతులు.
- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు.!
కోనరావుపేట, ఆంధ్రప్రభ : రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగండ్ల వాన,2వందల ఏకరాలకుపై నష్టపోయామంటున్నా రైతులు,ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు, నెలరాలిన వరి ధాన్యం అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికచ్చే సమయాన అకాల వడగండ్ల వాన ముంచేతింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో శనివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వానకు సుమారు 200 ఎకరాల వరి పొలాల్లో దాన్యం నేరాలుంది.

6నెలలు రాత్రిపగలు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అర్ధరాత్రి వడగండ్ల వాన రూపంలో ముంచేత్తడం అందరిని కంట తడి పెటించింది. చేసిన కష్టం ఒక వరి గింజ లేకుండా నెల రాలింది. అప్పు చేసి పెట్టిన పెట్టుబడి మీదపడి రైతు కోలుకోలేని దెబ్బ తగిలిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరారు.
