Fire Accident | 8 ఆటోలు దగ్ధం

Fire Accident | 8 ఆటోలు దగ్ధం
Fire Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పూతలపట్టు-చిత్తూరు నేషనల్ హైవేపై నిలిపి ఉంచిన కంటైనర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు కంటైనర్‌తో పాటు అందులో ఉన్న ఆటోలను పూర్తిగా దహనం చేశాయి.
తంబుగానీపల్లి డాబా వద్ద నిలిపి ఉంచిన కంటైనర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మొదట టైర్ల వద్ద ప్రారంభమైన మంటలు క్రమంగా డీజిల్ ట్యాంక్ వరకు వ్యాపించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

ఈ ఘటనలో కంటైనర్‌లో ఉన్న ఎనిమిది కొత్త ఆటోలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

