ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ద్వజస్తంభ ప్రతిష్ఠాపన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జాతర వేడుకలు దేవాలయ కమిటీ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ధ్వజస్థంభ దాతగా ముందుకు వచ్చిన నెల్లికంటి హరిప్రసాద్ కు, అన్నదాన కార్యక్రమం దాతగా సహకరించిన మాజీ జడ్పీటీసీ సభ్యులు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ప్రారంభమైన ఉత్సవాలు 7వ తేదీ మంగళవారం వరకు కొనసాగుతాయని చైర్మన్ శ్యాంసుందర్ ముదిరాజ్ తెలిపారు.

కల్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమలను ఆగంరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ వేడుకలలో శ్రీ రామలింగేశ్వర దేవాలయం ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిల్వెరు శంకర్ జెర్రిపోతుల అకిల మహేందర్ ఎల్లంకి లింగచారి, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.