సీఎం సహాయనిధి పేదలకు వరం

సీఎం సహాయనిధి పేదలకు వరం

ఊర్కొండ, ఆంధ్రప్రభ : సీఎం సహయ నిధి పేదలకు వరమని మాదారం కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం మాధారం గ్రామానికి చెందిన జల్లి జంగయ్య రూ.60,000 వేలు, ఖాజాపాషా రూ.20,000 వేలు, కటికం నారమ్మ రూ. 52,000 వేలు,రామ్ శశికళ రూ.36,000 వేలు దండు బుచ్చమ్మ రూ.42,000 వేల రూపాయలు మొత్తం రూ:2,10,000 వేల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిది నిధులు చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు, డిఎన్ఆర్ యువసేన సభ్యులు అందజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. పేదల పెన్నిధి జననేత జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేవిధంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి,మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డీఎన్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.