చేంగల్ లో భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజలందరిలో వసుదైక కుటుంబం అనే భావన వెల్లి విరియాలని ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని పాస్టర్ లు అన్నారు. భీమ్‌గల్ మండలం చేంగల్ కర్మేల్ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ లు మాట్లాడుతూ,దైవ కుమారుడైనప్పటికీ క్రీస్తు ప్రభువు ఎన్నో కష్టాలతో బాధింపబడి జనుల రక్షణ కోసం ప్రాణాలర్పించి , క్షమాపణ పంచి త్యాగము చేసిన వ్యక్తి ఏసుప్రభు అని అన్నారు.
బడుగు బలహీన కుటుంబాలకు వెలుగులు నింపి అందరికీ పరలోక దీవెనలు పంచిన దైవ కుమారుడు లోక రక్షకుడు అని తెలియజేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింప చేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పెద్ద మనసుతో తమ తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరారు. ఏసుప్రభు 33 ఏళ్లకే సర్వమానవాళి కోసం లోకం విడిచిన రోజంటూ పాస్టర్‌లు అనంతరావు, డేవిడ్ రాజ్‌లు సందేశాలను వినిపించారు.
ఏసుప్రభువును శిలువకు వేయబడిన రోజని తెలియజేశారు. క్రీస్తు చూపిన మార్గం శాంతి కి, ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం మండలంలోని వివిధ గ్రామాల నుంచి క్రైస్తవులు హాజరై భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ, దినమంతా చర్చిలోనే గడిపారు. ఉపవాస దీక్షలు పాటించారు.
