Tragic Incident | వాగులో పడి ఇద్దరు బాలురు…
Tragic Incident | వాగులో పడి ఇద్దరు బాలురు…
Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది.
జిల్లాలోని నష్కల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. వంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె మనోజ్, గూటం అకిరా నందన్ జాతర సందర్బంగా అక్కడికి వచ్చారు. సాయంత్రం సమయంలో వారు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది.
ఈ క్రమంలో వాగు ఒడ్డున వారి చెప్పులు, సైకిల్ కనిపించడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేసి ఆకేరు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తరువాత ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. సైకిల్‌ను కడిగేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీళ్లలో జారి పడడంతో ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర దుఃఖ వాతావరణం నెలకొంది.
